హైదరాబాద్ జిల్లా మేడ్చల్ పరిధిలోని తుర్కపల్లి-మురహరిపల్లి వద్ద భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్ దిశగా వస్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనలో కారు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ ఎక్కి, ఎదురుగా వస్తున్న లారీతో బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు సభ్యులు తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు.