జూనియర్ ఆసియా క్రీడల్లో భారత మహిళా హాకీ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. సెమీఫైనల్‌లో దక్షిణ కొరియాను 5-1 గోల్స్ తేడాతో ఓడించి, భారత్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.

ఈ మ్యాచ్‌లో భారత్‌కు గట్టి పోటీ ఎదురైంది. గతంలో ఆడిన మ్యాచ్‌లతో పోలిస్తే, దక్షిణ కొరియా క్రీడాకారిణులు ఈసారి భారత్‌ను బాగానే నిలువరించడానికి ప్రయత్నించారు.

అయితే, భారత క్రీడాకారిణులు పట్టు వదలకుండా ఆడి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పటికే పురుషుల జూనియర్ హాకీ జట్టు కూడా ఫైనల్స్‌కు చేరుకోవడం విశేషం.

ఇక టైటిల్ కోసం జరిగే తుది పోరులో భారత్ తలపడనుంది. చైనా మరియు జపాన్ జట్ల మధ్య జరగనున్న మరో సెమీఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో భారత్ ఫైనల్‌లో పోటీ పడుతుంది.