హాంగ్‌ఝౌ వేదికగా జరుగుతున్న ISSF ప్రపంచకప్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో హైదరాబాద్‌కు చెందిన షూటర్ ఇషా సింగ్ బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఫైనల్ పోటీలో ఇషా సింగ్ నిలకడగా రాణిస్తూ 40 హిట్స్‌తో అగ్రస్థానంలో నిలిచింది.
ఈ ఈవెంట్‌లో ఒలింపిక్ పతక విజేత మనూ బాకర్‌ను ఇషా సింగ్ ఓడించింది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో మనూ బాకర్ 586-20x స్కోర్‌తో మొదటి స్థానంలో, ఇషా సింగ్ 585-18x స్కోర్‌తో రెండో స్థానంలో నిలిచారు. అయితే, ఫైనల్‌లో ఇషా సింగ్ తన ప్రతిభను చాటి స్వర్ణాన్ని సొంతం చేసుకుంది.
మరోవైపు, మనూ బాకర్ కాంస్య పతకం కోసం తీవ్రంగా పోరాడాల్సి వచ్చింది. షూట్ ఆఫ్ దశను దాటుకుని వచ్చిన మనూ బాకర్, చివరికి 28 హిట్స్‌తో మూడో స్థానానికి పరిమితమైంది.







