ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) టెక్నీషియన్, గ్రాడ్యుయేట్, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 433 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇందులో టెక్నీషియన్ అప్రెంటిస్ 156, ట్రేడ్ అప్రెంటిస్/ఐటీఐ 104, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 104, మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగంలో 69 పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. విద్యార్హతల విషయానికి వస్తే, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు డిప్లొమా, ట్రేడ్ అప్రెంటిస్‌కు ఐటీఐ, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు బీబీఏ/బీఏ/బి.కాం/బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు 12వ తరగతితో పాటు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ స్కిల్ సర్టిఫికేట్ తప్పనిసరి.
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అకడమిక్ మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం www.iocl.com/apprenticeships వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.







