భారత పేసర్ అకీబ్ నబీ ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సర్రే జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. టెస్టు క్రికెట్‌లో బౌలింగ్ అనుభవం కోసం, ఇంగ్లండ్ పరిస్థితుల్లో స్వింగ్ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి బీసీసీఐ అతడిని అక్కడికి పంపింది. దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ జట్టు నుంచి వైదొలిగిన నబీ, ఇప్పటికే యూకే వీసాతో ఇంగ్లాండ్ చేరుకున్నాడు.
సెప్టెంబర్ 2న యార్క్‌షైర్ జట్టుతో జరిగే మ్యాచ్‌తో నబీ కౌంటీల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 8న సస్సెక్స్ జట్టుతో, సెప్టెంబర్ 15న గ్లమోర్గాన్ జట్టుతో సర్రే తలపడనుంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 43 మ్యాచుల్లో 162 వికెట్లు తీసిన ఈ బారాముల్లా ఎక్స్‌ప్రెస్, టీమిండియా బౌలింగ్ దళంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
ఈ కౌంటీ పర్యటన ద్వారా నబీని ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరగనున్న న్యూజిలాండ్ పర్యటనకు సిద్ధం చేయాలని బీసీసీఐ భావిస్తోంది. మూడు కౌంటీ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత, సెప్టెంబర్ 22న పుదుచ్చేరిలో ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరిగే మ్యాచ్ కోసం నబీ స్వదేశానికి తిరిగి రానున్నాడు.







