ఉద్యోగం మారినప్పుడు PF బ్యాలెన్స్ బదిలీ కోసం ప్రత్యేక దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. EPFO కొత్త విధానం ప్రకారం, కొత్త ఉద్యోగ స్థలంలో మొదటి PF కాంట్రిబ్యూషన్ జమ అయిన తర్వాతనే బ్యాలెన్స్ ఆటోమేటిక్‌గా బదిలీ అవుతుంది.

ఈ సదుపాయం పొందడానికి ఉద్యోగి UANని ఆధార్‌తో లింక్ చేసుకోవాలి. KYC వివరాలు పూర్తిగా అప్‌డేట్ చేయబడి ఉండాలి. ఈ షరతులు నెరవేర్చిన ఉద్యోగులు ప్రత్యేక దరఖాస్తు చేయకుండానే PF బదిలీని పొందవచ్చు.

ఈ మార్పు వలన ఉద్యోగులు సమయం మరియు పేపర్ వర్క్ తగ్గుతుంది. భవిష్యత్తులో PF అడ్వాన్స్, పెన్షన్ క్లెయిమ్ వంటి ప్రక్రియలు కూడా సులభతరం అవుతాయి. EPFO పోర్టల్‌లో సర్వీస్ హిస్టరీ మరియు KYC వివరాలను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి.