క్రియేటివ్‌ వర్క్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై బండి నాగరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో మీనాక్షి జైస్వాల్, ఆరియా మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు.

ఈ చిత్రంలో కాదంబరి కిరణ్, కిల్లి క్రాంతి, అనంత ప్రభు, టేస్టీ తేజ, సాయి కిషోర్, నితిన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాకు రోహిత్ సంగీతం అందిస్తుండగా, మద్దినేని రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

సినిమా అంటే వందల కుటుంబాలు ఆధారపడి ఉంటాయని, నిర్మాత బండి నాగరాజుకు సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉందని భార్గవ్ తెలిపారు. ఈ చిత్రంతో తెలుగులో తన సినీ ప్రయాణం మొదలుపెట్టడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

త్వరలోనే ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తాయని భార్గవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.