హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌లో H-1B వీసా పునరుద్ధరణ కోసం వెళ్తున్న అప్లికెంట్లకు ఇంటర్వ్యూ సమయంలో 221(g) అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్ నోటీసులు అందుతున్నాయి. దీనివల్ల వీసా జారీ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది.
ఈ సమస్యను ఎదుర్కొంటున్న అప్లికెంట్లకు కాన్సులేట్ అధికారులు ప్రత్యేక సూచనలు చేస్తున్నారు. తమకు సంబంధించిన పాత ఎల్సీఏ (LCA - లేబర్ కండిషన్ అప్లికేషన్) కాపీలను ఈమెయిల్ ద్వారా పంపాలని వారు కోరుతున్నారు.
వీసా పునరుద్ధరణ ఇంటర్వ్యూల సమయంలో తగిన ముందస్తు సమాచారం లేదా సలహాలు లేకపోవడం వల్ల అప్లికెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో, దరఖాస్తుదారులు తమ పాత ఎల్సీఏ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవడం అవసరమని అధికారులు సూచిస్తున్నారు.







