భగత్‌సింగ్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు లడ్డు యాదవ్ నేతృత్వంలో నగరంలో భారీ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న సోను సూద్, బేగంబజార్ ఛత్రి చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన వేదికపై మాట్లాడారు.
బేగంబజార్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని సోను సూద్ చెప్పారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆయన కోరారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆదుకోవడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు.
ర్యాలీలో యువత భారీ సంఖ్యలో పాల్గొనడంపై సోను సూద్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు వికలాంగులకు వీల్ చైర్లు, అనాథ విద్యార్థులకు పాఠశాల బ్యాగులను ఆయన పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పవన్ సింగ్, అజయ్ అగర్వాల్, రోమల్ సింగ్, దినేష్ యాదవ్, గురుసింద్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు. యువతలో అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.








