అంతరిక్ష పరిశోధనల్లో ప్రైవేట్ సంస్థ స్పేస్‌ఎక్స్ (SpaceX) మరో కీలక ఘట్టాన్ని చేరుకుంది. టెక్సాస్‌లోని బోకా చిగా వద్ద ఉన్న స్టార్‌బేస్ లాంచ్ ప్యాడ్ నుంచి శనివారం ఉదయం స్టార్‌షిప్ ఫ్లైట్-13 ప్రయోగం జరిగింది. భవిష్యత్తులో చంద్రుడు, అంగారక గ్రహంపైకి మానవులను తీసుకెళ్లే లక్ష్యంతో, పూర్తిస్థాయి పునర్వినియోగ రాకెట్ వ్యవస్థను అభివృద్ధి చేసే దిశగా ఈ ప్రయోగం సాగింది.
ప్రయోగం మొదలైన రెండు నిమిషాలకే ప్రధాన రాకెట్ నుంచి బూస్టర్ విభాగం వేరుపడింది. అయితే, గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ల్యాండ్ కావాల్సిన బూస్టర్-20, ఇంజిన్ స్టార్టింగ్ సమస్యల కారణంగా నియంత్రణ కోల్పోయి దెబ్బతింది. మరోవైపు, స్టార్‌షిప్-40 వ్యోమనౌక అంతరిక్షంలో ప్రయాణిస్తూ 20 నెక్స్ట్ జనరేషన్ స్టార్‌లింక్ వెర్షన్-3 ఇంటర్నెట్ ఉపగ్రహాలను కక్ష్యలోకి విజయవంతంగా పంపింది.
సుమారు గంటన్నర ప్రయాణం తర్వాత, వ్యోమనౌక భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించింది. ప్లాన్ చేసిన విధంగానే హిందూ మహాసముద్రంపై సురక్షితంగా నీటిపై దిగింది (సోఫ్ట్ స్ప్లాష్ డౌన్). స్టార్‌షిప్ వ్యోమనౌక సముద్రంలో క్షేమంగా ల్యాండ్ కావడం ఇదే మొదటిసారి కావడంతో, స్పేస్‌ఎక్స్ బృందం ఈ ప్రయోగాన్ని గొప్ప విజయంగా పేర్కొంది. సంస్థ అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియా వేదికగా ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేశారు.








