అరేబియా వాణిజ్య నౌకలపై హౌతీలు దాడులకు పాల్పడటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హార్ముజ్ జలసంధిలో రెండు సౌదీ అరేబియా నౌకలపై హౌతీలు కాల్పులు జరిపిన నేపథ్యంలో, ట్రూత్ సోషల్ వేదికగా ఆయన ఈ హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో హౌతీలు నౌకలపై దాడులు చేసినప్పుడు అమెరికా భారీ సైనిక చర్య చేపట్టిందని ట్రంప్ గుర్తు చేశారు. ఇరాన్ మద్దతుతో పనిచేసే హౌతీలు, గత కొంతకాలంగా సంయమనంతో ఉన్నప్పటికీ, మళ్లీ దాడులకు దిగడం తనను నిరాశకు గురిచేసిందని ఆయన పేర్కొన్నారు.
హౌతీలు దాడులను కొనసాగిస్తే, దానికి ఇరాన్‌నే పూర్తి బాధ్యుడిగా పరిగణిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతమైతే, ఇరాన్‌తో పాటు హౌతీలపై కూడా భీకర దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు. గతంలో కంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరికలో పేర్కొన్నారు.







