జూలై 15న చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు మరియు ధూళిమిట్ట మండలాల మహిళా సంఘాలు తమ గ్రామాల నుండి గన్నీ బ్యాగులను చేర్యాల పౌరసరఫరాల గోడౌన్‌కు తీసుకువచ్చాయి. వాటిని తిరిగి తీసుకోవడానికి అధికారులు నిరాకరిస్తున్నారని మహిళలు ఫిర్యాదు చేస్తున్నారు.
రైస్‌మిల్లుల నుండి మొదటి బ్యాగులను సరఫరా చేసిన తర్వాత, మిగిలిన వాటిని పౌరసరఫరాల శాఖ అధికారులు గ్రామీణ మహిళా సంఘాలకు పంపించారు. వడ్ల కొనుగోళ్లు పూర్తయిన తర్వాత ఈ బ్యాగులను తిరిగి తీసుకోవడానికి మహిళలు గోడౌన్ అధికారులను సంప్రదించినప్పటికీ, అధికారులు తీసుకోవడానికి నిరాకరించారు.
ఒక గ్రామం నుండి వచ్చిన మహిళల నుండి కొన్ని బ్యాగులను తీసుకుని మిగిలినవాటిని రైస్‌మిల్లులకు తిరిగి పంపిస్తున్నారని సమాచారం. ఇది మహిళా సంఘాల ఆర్థిక నష్టానికి దారి తీస్తోందని ఆరోపణలు. జిల్లా అధికారులు ఈ విషయంలో తగిన విచారణ జరిపి న్యాయం చేయాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.








