చుంచుపల్లి మండలం గౌతంపూర్‌లో కోతుల సంఖ్య విపరీతంగా పెరగడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గ్రామ ప్రజలు సర్పంచ్ కళ్యాణి, సెక్రటరీ షర్మిలకు వినతిపత్రం అందజేశారు.
గ్రామంలో కోతుల వల్ల చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని స్థానికులు తెలిపారు. కోతులు ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడమే కాకుండా, ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కోతులను పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వారు కోరుతున్నారు.
ఒకవేళ కోతుల బెడదను పరిష్కరించడంలో అధికారులు విఫలమైతే, ఇకపై నిర్వహించే గ్రామసభలను బహిష్కరిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.








