ఫుకెట్ నుంచి ఢిల్లీ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI2379 ప్రయాణంలో ఉండగా అకస్మాత్తుగా ఎత్తు కోల్పోయింది. ఈ విమానంలో మొత్తం 137 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. విమానం ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయినప్పటికీ, ప్రయాణ సమయంలో జరిగిన ఈ ఘటన ఆందోళన కలిగించింది.

ఈ ఘటనలో 8 మంది ప్రయాణికులు, 4 మంది విమాన సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రమాదానికి గురైన ఈ ఎయిర్‌బస్ విమానం 7 ఏళ్ల వయస్సు కలిగినది.

ప్రస్తుతం ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు. విమానంలోని ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమాన తయారీ సంస్థకు కూడా సమాచారం అందించామని, విచారణకు పూర్తి సహకారం అందిస్తున్నామని ఎయిర్ ఇండియా పేర్కొంది.