దుమ్ముగూడెం మండలంలో వర్షాలు తక్కువగా కురుస్తున్న నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని ఎంపీడీఓ వివేక్‌రావు, తాసీల్దార్ అశోక్‌కుమార్, ఏఓ నవీన్‌కుమార్ కోరారు. మంగళవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో వారు ఈ అంశంపై చర్చించారు.
నీటిని ఆదా చేసే పద్ధతులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఇంకుడు గుంటలు, ఊటకుంటలు, బోర్‌వెల్ రీచార్జ్ స్ట్రక్చర్‌లను ఏర్పాటు చేసుకోవాలని సర్పంచులకు సూచించారు. గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య పనులను వేగవంతం చేయాలని కూడా వారు ఆదేశించారు.
రైతులకు అవసరమైన సహాయ సహకారాలను స్థానిక ఏఈవోలు అందించాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీడీపీఓ, విద్యుత్తు శాఖ ఏఈ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.







