కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించకపోతే, ఆ డిమాండ్ ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా వరకు వెళ్తుందని కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే హెచ్చరించారు. కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు కంటే ఒక విఫలమైన మంత్రి ముఖ్యమని భావిస్తే, రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఓటు వేయరని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. చర్చలకు ఏ సమయంలోనైనా సిద్ధంగా ఉన్నామని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు. జేపీ నడ్డా కార్యాలయంలో లేదా ఆయన నివాసంలో చర్చలు జరపవచ్చని ప్రభుత్వం ప్రతిపాదించింది.

అయితే, చర్చల విషయంలో సీజేపీ తన పట్టు వీడటం లేదు. ప్రభుత్వం జంతర్ మంతర్ లేదా కానిస్ట్యూషన్ క్లబ్ వంటి తటస్థ వేదికలకు వచ్చి చర్చలు జరపాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. చర్చలు జరగాలంటే ముందుగా కేంద్రమంత్రిని తొలగించాలనే షరతును సీజేపీ స్పష్టం చేసింది.