తెలంగాణ ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న ముఠాపై టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఉక్కుపాదం మోపారు. ఢిల్లీలోని శివ మార్కెట్‌లో బజాజ్ ఫైనాన్స్ పేరుతో నడుస్తున్న మూడు నకిలీ కాల్ సెంటర్లపై పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు.
తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామంటూ ఈ ముఠా అమాయకులను నమ్మించేది. లోన్ ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్, వెరిఫికేషన్ మరియు బీమా ప్రీమియంల పేరుతో బాధితుల నుంచి భారీగా నగదు వసూలు చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఈ ఆపరేషన్‌లో భాగంగా 21 మంది మహిళా టెలికాలర్లతో పాటు ఒక బ్యాంకు ఖాతాదారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారంతా తెలంగాణ రాష్ట్రానికి చెందినవారని అధికారులు ధృవీకరించారు.
ఈ రాకెట్‌కు ప్రధాన సూత్రధారులుగా ఉన్న లలిత్ సింగ్ మరియు కుల్దీప్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలను పోలీసులు ముమ్మరం చేశారు.








