మైక్రోసాఫ్ట్ తన ప్రపంచవ్యాప్త ఉద్యోగ బలంలో 2.1 శాతం మేర అంటే దాదాపు 4,800 మంది ఉద్యోగులను ఉపసంహరించుకుంది. ఈ నిర్ణయం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెంచుకోవడం కోసం ఖర్చులను తగ్గించడంలో భాగంగా తీసుకుంది.
టెక్ రంగంలో అన్ని పెద్ద కంపెనీలు ఈ ఏడాది AI రంగంలో 700 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెడుతున్నాయి. మైక్రోసాఫ్ట్ కాకుండా అమెజాన్, మెటా, గూగుల్ వంటి కంపెనీలు కూడా సంప్రదాయ ఉద్యోగాలపై కోతలు విధిస్తున్నాయి.
2026 మొదటి ఆరు నెలల్లో మైక్రోసాఫ్ట్ షేర్లు 23 శాతం పడిపోయాయి. 2022 తర్వాత ఇదే కంపెనీకి అత్యంత దారుణమైన ఫస్ట్ హాఫ్ ప్రదర్శన అయింది. ఈ కఠిన నిర్ణయానికి దారితీసింది.
ఈ ఏడాది ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ యూఎస్ పరిధిలోని 7 శాతం ఉద్యోగులకు (దాదాపు 9,000 మంది) స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రకటించింది. ఇప్పుడు లేఆఫ్స్ ప్రకటించడంతో ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.








