హైదరాబాద్‌లో జరిగిన బోనాల వేడుకల్లో ఫరియా అబ్దుల్లా ఉత్సాహంగా పాల్గొన్నారు. బోనం ఎత్తుకుని మహిళలతో కలిసి ఊరేగింపులో పాల్గొనడమే కాకుండా, పోతురాజులతో కలిసి డ్యాన్స్ చేస్తూ పండుగను ఆస్వాదించారు.

అయితే, ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు నెటిజన్లు ఆమెపై మతపరమైన వ్యాఖ్యలు చేశారు. తనను 'కాఫిర్' (వేరే మతస్థురాలు) అంటూ విమర్శించడంతో ఫరియా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

ఈ విమర్శలపై స్పందిస్తూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. తన తండ్రి ఇస్లాం మతాన్ని స్వీకరించారని, ప్రతి జీవిలో దేవుడిని చూడటమే అసలైన భక్తి అని ఆమె కన్నీళ్లతో చెప్పారు. ద్వేషాన్ని పెంచుకోవడం తప్పు మార్గమని, అల్లా అంటే ప్రతిచోటా ఉండే వెలుగు అని ఆమె పేర్కొన్నారు.