సుమారు 13 ఏళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న జబర్దస్త్ కామెడీ షో, 2013లో ప్రారంభమైంది. ఈ షో ద్వారా సుడిగాలి సుధీర్, గెటప్ శీను, హైపర్ ఆది, రామ్ ప్రసాద్ వంటి ఎంతో మంది కళాకారులు వెలుగులోకి వచ్చారు. వీరంతా ఇప్పుడు సినిమాల్లో నటులుగా, దర్శకులుగా తమ ప్రతిభను చాటుకుంటున్నారు.
జబర్దస్త్ స్టార్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్ ప్రస్థానం ఎంతో కష్టతరంగా సాగింది. ఆయన కనీసం ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేయలేదు. కుటుంబ పోషణ కోసం వైజాగ్‌లో ఒక మెడికల్ షాపులో ఆరేళ్ల పాటు పనిచేశారు.
నటనపై ఉన్న ఆసక్తితో స్నేహితుడి సాయంతో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన రామ్ ప్రసాద్, మొదట రచయితగా జబర్దస్త్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత సుడిగాలి సుధీర్, గెటప్ శీనులతో కలిసి స్కిట్స్ చేస్తూ స్టార్ కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
సుడిగాలి సుధీర్, గెటప్ శీను వంటి వారు సినిమా అవకాశాల కోసం చాలా కాలం క్రితమే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చారు. అయితే, రామ్ ప్రసాద్ మాత్రం ఇప్పటికీ జబర్దస్త్ స్కిట్స్ రాస్తూ, కమెడియన్‌గా కొనసాగుతూనే అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తున్నారు.
త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితాలో రామ్ ప్రసాద్ పేరు ఖరారైనట్లు సమాచారం. ఈ రియాలిటీ షోలో పాల్గొనేందుకు ఆయన జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది.








