హైదరాబాద్, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలోని దోతిగూడెం హెజీలో ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి.
బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
ప్రమాదానికి గల కారణాలు, ఘటన సమయంలో కంపెనీలో ఎంత మంది కార్మికులు ఉన్నారన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.








