పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నారాయణపురంలో నివసించే బంగారు వ్యాపారి స్వామి శ్రీనివాసరావు ఇంట్లో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దుండగులు లోపలికి ప్రవేశించారు.
ఈ ఘటనలో సుమారు 350 గ్రాముల బంగారంతో పాటు మరికొన్ని విలువైన వస్తువులను దొంగలు అపహరించారు. చోరీకి గురైన ఆస్తి విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుందని బాధితుడి కుటుంబ సభ్యులు అంచనా వేస్తున్నారు.
ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో అనుమానితుడి కదలికలు రికార్డయ్యాయి. ఈ దృశ్యాలను పరిశీలించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు అధికారులు తెలిపారు.








