బాలాపూర్ బిస్మిల్లా కాలనీకి చెందిన అహ్మద్ సలాం (21), బిహార్‌కు చెందిన రెహానా (21) స్థానిక ఫంక్షన్ హాల్‌లో లేబర్‌లుగా పనిచేస్తూ సహజీవనం చేస్తున్నారు. పెళ్లి చేసుకోవాలని రెహానా ఒత్తిడి తేవడంతో, ఆమె ఇతర వ్యక్తులతో చనువుగా ఉంటోందని సలాం అనుమానం పెంచుకున్నాడు.
ఆదివారం ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో, సలాం కత్తితో రెహానాను పొడిచి చంపేశాడు. ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని మాయం చేసేందుకు నిందితుడు గోనెసంచిలో మూటకట్టాడు.
తెల్లవారుజామున 5 గంటలకు పక్కింటి వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.








