సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం బాలానగర్‌లో ఎంఎస్‌ఎంఈ (MSME) అవుట్‌రీచ్ క్యాంపెయిన్‌ను నిర్వహించింది. చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక చేయూతనిచ్చే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో రూ. 150 కోట్ల మేర వ్యాపార లావాదేవీలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు పారిశ్రామికవేత్తలతో నేరుగా మాట్లాడారు. ఎంఎస్‌ఎంఈ రుణ పథకాలు, వాటి ప్రయోజనాలపై వివరణాత్మక ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఈ ప్రయత్నంలో భాగంగా రూ. 40 కోట్ల విలువైన రుణాలను బ్యాంక్ మంజూరు చేసింది. మరో రూ. 60 కోట్లకు సంబంధించి ఇన్-ప్రిన్సిపుల్ శాంక్షన్స్ జారీ అయ్యాయి.
అంతేకాకుండా, రూ. 50 కోట్ల విలువైన కొత్త ఎంఎస్‌ఎంఈ రుణ దరఖాస్తులను బ్యాంక్ సేకరించింది. కార్యక్రమం జరిగిన రోజే రూ. 25 కోట్ల రుణాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ ప్రత్యేక డ్రైవ్ ద్వారా హైదరాబాద్ ప్రాంతంలో ఎంఎస్‌ఎంఈ రంగంలో ఆర్థిక వనరుల లభ్యత మరింత పెరగనుంది.







