ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం సబ్సిడీ బీసీలకు 90శాతం రాయితీపై డ్రిప్‌ ఉచితంగా మొక్కల పంపిణీ మూడేళ్ల పాటు నిర్వహణ ఖర్చుల చెల్లింపు ఒక్కసారి నాటితేముప్పై ఏళ్ల పాటు దిగుబడి లగచర్లలో ఫ్యాక్టరీ ఏర్పాటు దిశగా అడుగులు

కొడంగల్‌: జిల్లా రైతులు ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. ఆయిల్‌ పామ్‌ సాగు అద్భుతమైన ఆదాయ వనరు. ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపుతుండటంతో సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం సబ్సిడీ, బీసీలకు 90 శాతం రాయితీపై డ్రిప్‌ పరికరాలు అందిస్తున్నారు. మొక్కలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మూడేళ్ల పాటు సాగు ఖర్చులు ప్రభుత్వమే చెల్లింనుంది. ఒక్కసారి మొక్కలు నాటితే ముప్‌పై ఏళ్ల పాటు దిగుబడి వస్తుంది. పామాయిల్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదా యం వచ్చే పంటగా పేరుంది. కొడంగల్‌ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 3,600 ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగవుతోంది.

నల్లరేగడి, ఎర్రనేలలు, సారవంతమైన నేలలు అనుకూలం. నీటి వసతి తప్పని సరిగా ఉండాలి. డ్రిప్‌ పరికరాలు తీసుకోవాలి. పశువుల ఎరువు శ్రేష్ట్రంప్రతి మూడు నెలలకు ఒకసారి ఎరువులు వేయాలి. మొదటి ఏడాది యూరియా వాడాలి. ఆయిల్‌ పామ్‌లో అంతర పంటగా కంది,పత్తి, మొక్కజొన్న, కూరగాయల పంటలు వేసుకోవచ్చు. మూడవ ఏట నుంచి పూత వస్తుంది. నాల్గవ ఏట నుంచి కోత మొదలు అవుతుంది. ప్రతి 12 రోజులకు ఒకసారి గెలలు కోయాలి. బాగా పండిన నల్లటి పండ్లు రాలినప్పుడు కోతకు వచ్చినట్లు గ్రహించాలి. నాలుగో ఏడాది నుంచి మొక్కలకు యూరియా, సింగల్‌ సూపర్‌, పోటాష్‌, పశువుల ఎరువు వాడాలి. ఐదవ ఏడాది నుంచి ఎకరాకు 8 నుంచి 10 టన్నుల గెలలు వస్తాయి. ఎనిమిదవ ఏట నుంచి 15 నుంచి 20 టన్నుల దిగుబడి వస్తుంది. మార్కెట్‌లో ఒక టన్నుకు రూ.19,694 వరకు ధర పలుకుతుంది. మొక్కల చుట్టూ కలుపు లేకుండా చూడాలి. వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడాలి.

వికారాబాద్‌ పట్టణం కలెక్టరేట్‌లోని ఉద్యానవన శాఖ కార్యాలయంలో సంప్రదించాలి. ఆధార్‌ కార్డు జిరాక్స్‌, పట్టాదారు పాస్‌బుక్కు, బ్యాంకు పాస్‌బుక్‌ తీసుకెళ్లాలి. మీ భూమిని అధికారులు చూసిన తర్వాత మీ దరఖాస్తును ఆమోదిస్తారు.

జిల్లా రైతులకు ఇది శుభవార్తగా చెప్పవచ్చు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీ రాబోతోంది. దుద్యాల మండలం ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో ఈకో పామ్‌ ఆయిల్‌ అండ్‌ ప్యాట్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ 50ఎకరాల్లో రూ.80 కోట్ల వ్యయంతో పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినట్లు అధికారిక వర్గాలు తెలి పాయి. ఏడాదిలోగా రైతులకు అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలో నేరుగా వంద మందికి, పరోక్షంగా వెయ్యి మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. జిల్లాలో మరో పరిశ్రమ ఏర్పాటుకు కూడా ప్రతిపాదన ఉంది.

ఆయిల్‌ పామ్‌ సాగుతో అ ధిక లాభాలు వస్తాయి. జి ల్లాలో 3,600 ఎకరాల్లో పంట సాగవుతోంది. రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రభుత్వం ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తోంది.మామిడి, కూరగాయలు పంటలకు సబ్సిడీ వస్తుంది.ఆయిల్‌ పామ్‌ దిగుబడి కి మంచి డిమాండ్‌ ఉంది.ఫ్యాక్టరీ ఏర్పాటువిష యా న్ని రైతులకు వివరించి సాగును ప్రొత్సహిస్తున్నాం.