మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. రుస్సో బ్రదర్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, మార్వెల్ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఇన్ఫినిటీ వార్, ఎండ్‌గేమ్ వంటి బ్లాక్‌బస్టర్లను అందించిన రుస్సో బ్రదర్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాలో థోర్, కెప్టెన్ అమెరికా, ఫెంటాస్టిక్ ఫోర్, బ్లాక్ పాంథర్ మరియు ఎక్స్-మెన్ హీరోలు అందరూ కలిసి మల్టీవర్స్ మ్యాడ్‌నెస్‌ను తెరపై చూపించబోతున్నారు. ఐరన్ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న రాబర్ట్ డౌనీ జూనియర్, ఈ చిత్రంలో విలన్ డాక్టర్ డూమ్ పాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు క్రిస్ ఎవాన్స్, క్రిస్ హేమ్స్‌వర్త్, టామ్ హిడిల్‌స్టన్ వంటి హాలీవుడ్ తారలు ఈ యాక్షన్ డ్రామాలో భాగమయ్యారు.
మూడు వేర్వేరు మార్వెల్ యూనివర్స్ సూపర్ హీరోలు అందరూ ఏకమై, డాక్టర్ డూమ్‌తో చేసే పోరాటమే ఈ సినిమా కథాంశం. ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, థార్, హల్క్, బ్లాక్ విడో వంటి పాత్రలకు ఇండియాలో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదల చేస్తున్నారు.
భారతీయ బాక్సాఫీస్ వద్ద సూపర్ హీరో సినిమాలకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో, ఈ భారీ యాక్షన్ చిత్రం ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి. డిసెంబర్ 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.








