గంటల తరబడి ఫోన్‌లో గేమ్స్ ఆడటం, రీల్స్ చూడటం, యూట్యూబ్ వీడియోలు చూడటం వంటి అలవాట్ల వల్లే తనకు ఈ వ్యాధి సోకిందని డాక్టర్లు నిర్ధారించారని షకీల తెలిపారు. నిద్రపోయే ముందు కూడా ఫోన్ చూడటం వల్ల తీవ్రమైన మెడనొప్పి వచ్చి, చివరకు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు.
ప్రస్తుతం చెన్నైలోని తన నివాసంలో ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ శస్త్రచికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చయ్యాయని, విపరీతమైన మెడనొప్పితో తాను పడిన బాధ వర్ణనాతీతమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు లేదా వారు మారాం చేస్తున్నప్పుడు ఫోన్ ఇవ్వకండి అని తల్లిదండ్రులకు షకీల విజ్ఞప్తి చేశారు. తనలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని, పిల్లలను మొబైల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలని ఆమె సోషల్ మీడియా వేదికగా కోరారు.








