జపాన్ వేదికగా త్వరలో జరగనున్న ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా హైదరాబాదీ బ్యాటర్ వివిఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నారు. లక్ష్మణ్ జట్టుతో కలిసి జపాన్ వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.
మరో రెండు వారాల్లో ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఆసియా క్రీడల్లో భారత జట్టుకు లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించడం ఇది రెండోసారి. గతంలో 2023లో చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో కూడా లక్ష్మణ్ టీమిండియాకు మార్గదర్శకత్వం వహించారు.
ప్రస్తుతం వెస్టిండీస్ జట్టు భారత్‌లో వన్డే సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ ఆసియా క్రీడల సమయంలోనే జరుగుతుండటంతో, టీమిండియా ప్రధాన కోచ్ గంభీర్ స్వదేశంలోనే ఉండనున్నారు.
ఈ నేపథ్యంలో ఆసియా క్రీడలకు వెళ్లే భారత జట్టుకు లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తారని భారత క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఈ నియామకంపై బోర్డు గురువారం అధికారికంగా సమాచారం ఇచ్చింది.








