కేంద్ర మంత్రులు జేపీ నద్దా, జితేంద్ర సింగ్‌లతో శనివారం మూడు దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తమ నిరసనను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ చర్చల్లో అశుతోష్ రాంకా నేతృత్వంలోని సీజేపీ ప్రతినిధులు పాల్గొన్నారు.
కేంద్రం తమ డిమాండ్లను అంగీకరించడంతో నిరసనకారులు, మద్దతుదారులు శాంతియుతంగా దీక్షను విరమించి ఇళ్లకు వెళ్లాలని పార్టీ సూచించింది. నిరసనకారులు వెంటనే దీక్షను ముగించాలని అశుతోష్ రాంకా కోరారు.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో పాటు, నిరసనకారులపై నమోదైన కేసులు, ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలని సీజేపీ కోరింది. అలాగే నీట్ (NEET) పేపర్ లీకేజీ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందించాలన్న డిమాండ్‌ను కేంద్రం నెరవేర్చింది.
భవిష్యత్తు వ్యూహాల గురించి, ఇతర సమస్యలపై స్పందన గురించి త్వరలోనే తెలియజేస్తామని సీజేపీ ప్రతినిధులు వెల్లడించారు. ప్రస్తుతానికి నిరసనకారులందరూ క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని పార్టీ స్పష్టం చేసింది.








