యాక్షన్ కింగ్ అక్షయ్ కుమార్, నవాబ్ సైఫ్ అలీ ఖాన్ కాంబినేషన్ అంటేనే ఫ్యాన్స్‌కు పూనకాలే. గతంలో 'మై ఖిలాడీ తూ అనారీ','తషాన్' వంటి చిత్రాలతో అలరించారు. దాదాపు 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరు మళ్లీ ఇప్పుడు ఒకే స్క్రీన్‌పై తలపడబోతున్నారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో మైండ్-బెండింగ్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ 'హైవాన్' (Haiwaan) తెరకెక్కుతోంది. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా.. నెట్టింట సంచలనం సృష్టిస్తోంది.

ఎప్పుడూ మార్క్ కామెడీ చిత్రాలతో అలరించే ప్రియదర్శన్, ఈసారి పూర్తిగా తన రూట్ మార్చి డార్క్ అండ్ ఇంటెన్స్ పిల్లి-ఎలుకల ఆటను తెరకెక్కించారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ పవర్‌ఫుల్ అండ్ క్రూరమైన విలన్ అవతారంలో భయపెడుతుండగా.. సైఫ్ అలీ ఖాన్ అంధుడి (రహస్యాలు దాచిన చూపులేని వ్యక్తి) పాత్రలో కనిపిస్తున్నారు. అంధుడిగా ఉండటం కంటే ఘోరమైనది తెలివితక్కువగా ఉండటం అంటూ సాగే వాయిస్ ఓవర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. నగరంలో వరుసగా జరిగే మర్డర్లు, అంధుడైన సైఫ్‌ను వేటాడే అక్షయ్ వికృత చేష్టలు మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్‌లో ఉన్నాయి.

ఈ చిత్రంలో కేస్‌ను ఛేదించే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సయామి ఖేర్ నటించారు. బొమన్ ఇరానీ జడ్జిగా, కథను మలుపు తిప్పే ఇతర ముఖ్య పాత్రల్లో శ్రియా పిగ్లోంకర్, షరీబ్ హష్మి పోషించారు. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, దిస్పియన్ ఫిలింస్ బ్యానర్లపై వెంకట్ కే నారాయణ, శైలజా దేశాయ్ ఫెన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. థ్రిల్లింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, డార్క్ విజువల్స్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది.

అటు అక్షయ్ నెగెటివ్ షేడ్స్, ఇటు సైఫ్ మైండ్ గేమ్స్ మధ్య సాగే ఈ హై-వోల్టేజ్ యాక్షన్ సస్పెన్స్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకులను సీట్ల అంచులపై కూర్చోబెట్టడానికి సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ సెప్టెంబర్ 11, 2026 న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ 'హైవాన్' సృష్టించే విధ్వంసం ఎలా ఉంటుందో చూడాలి మరి.