ఆమిర్ ఖాన్‌ను తాను పట్టించుకోకుండా వెళ్ళిపోయానంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోపై నటి ప్రీతి జింటా అసహనం వ్యక్తం చేశారు. తన వ్యాన్ నుండి బయటకు వస్తున్న సమయంలో ఆమిర్ ఖాన్‌ను తాను చూడలేదని ఆమె పేర్కొన్నారు.
ఆ సమయంలో తాను షూటింగ్‌లో బిజీగా ఉండటంతో పాటు, విమానం అందుకోవాల్సిన తొందరలో ఉన్నానని ప్రీతి జింటా స్పష్టం చేశారు. ఇలాంటి వీడియోలు కేవలం క్లిక్‌బైట్ కోసమే సృష్టిస్తున్నారని ఆమె కొట్టిపారేశారు.
ఆమిర్ ఖాన్ పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని ప్రీతి జింటా తెలిపారు.








