అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన విదేశీ కార్మికులకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించాలని ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఉద్యోగం పోయిన తర్వాత కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి లేదా దేశం విడిచి వెళ్లడానికి ప్రభుత్వం ఇచ్చే గడువు సమయాన్నే గ్రేస్ పీరియడ్ అంటారు.
ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే, ఉద్యోగం కోల్పోయిన వెంటనే సదరు కార్మికులు అమెరికాను వదిలి వెళ్లాల్సి ఉంటుంది.
దీనివల్ల ఉద్యోగం కోల్పోయిన వారు అమెరికాలో మరో కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి లేదా తమ వీసా స్థితిని మార్చుకోవడానికి అవకాశం ఉండదు. ఈ నిబంధన వల్ల ప్రభావితమయ్యే కార్మికులు తక్షణమే దేశం దాటాల్సి వస్తుంది.







