పదేళ్ల క్రితం రూ.251కే స్మార్ట్‌ఫోన్ ఇస్తామని చెప్పి జరిగిన మోసం నేపథ్యంలో 'ఆజాదీ 501' అనే టెక్ థ్రిల్లర్ సిరీస్ సిద్ధమైంది. ఈ సిరీస్ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఇందులో తేజ, హర్షవర్ధన్, శశాంక్ ప్రధాన పాత్రల్లో నటించారు.

కథ విషయానికి వస్తే, నెలకు రూ.20 వేల సంపాదన కలిగిన ఒక మధ్య తరగతి యువకుడు సొంతంగా బిజినెస్ చేయాలని ప్రయత్నిస్తాడు. అయితే ఎవరి నుంచి మద్దతు లభించని ఆ కుర్రాడికి, రూ.501కే ఫోన్ అందించాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఆ తర్వాత జరిగిన పరిణామాలు, అందులో దాగున్న స్కామ్ ఏంటనేది ఈ సిరీస్ ప్రధానాంశం.

ఈ సిరీస్ వచ్చే బుధవారం, జూలై 29 నుంచి ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి రానుంది. ఇందులో నటించిన వారంతా తెలుగు నటులే కావడం విశేషం.

ఈ వారంలోనే ఓటీటీల్లో మరికొన్ని చిత్రాలు కూడా సందడి చేస్తున్నాయి. నాగబంధం, పురుషః వంటి తెలుగు చిత్రాలతో పాటు కాన్ సిటీ, పల్లిచట్టంబి వంటి డబ్బింగ్ సినిమాలు, ఆదర్శ బాలవిద్యాలయ అనే సిరీస్ కూడా ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్నాయి.