ఐపీఎల్ 2027 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ బరిలోకి దిగే అవకాశం ఉంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, ఈ టోర్నీకి తాను అందుబాటులో ఉంటానని ఆ జట్టు సీనియర్ సభ్యుడికి కమిన్స్ హామీ ఇచ్చాడు. కావ్య మారన్ యాజమాన్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ ఆటగాడిని 18 కోట్ల రూపాయల భారీ మొత్తానికి రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అతడు పూర్తి సీజన్ ఆడుతాడా లేదా అనేది ఇంకా తేలలేదు.
బిజీ ఇంటర్నేషనల్ షెడ్యూల్ కారణంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు చాలా మంది IPL 2027కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. జాకబ్ బెథెల్, మిచెల్ స్టార్క్ రాబోయే సీజన్‌కు తమ అందుబాటులో లేమని ఇప్పటికే స్పష్టం చేశారు. వరుస టెస్ట్ మ్యాచ్‌లు, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా కంగారూ ఆటగాళ్లకు ఈ టోర్నీలో ఆడటం కష్టంగా మారింది.
జాతీయ జట్టు పట్ల బాధ్యతల దృష్ట్యా కమిన్స్ కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే తన సేవలను అందించే అవకాశం ఉందని చెబుతున్నారు. జాతీయ జట్టు కోసం ఆడుతూ ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరమవడం అతడికి కొత్త కాదు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 16న జరగనున్న IPL 2027 మినీ వేలానికి ముందు ఈ అప్‌డేట్ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఐపీఎల్ 2027 ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టు మొత్తం 9 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. జనవరి నుంచి మార్చి వరకు భారత్‌తో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్ జట్టు తలపడనుంది. ఆ తర్వాత జూన్ నుంచి ఆగస్టు మధ్య యాషెస్ సిరీస్‌లో ఈ జట్టు పాల్గొననుంది.






