అన్షు, వాసవి గణేశన్ జంటగా నటించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ’హుషారు పిట్టలు’. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ బ్యానర్‌పై వెంకట్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకున్నాయి.
ఈ చిత్రం నుంచి విడుదలైన ’టోంగా టోంగా’, ’సక్కని గడియ’ పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమా ట్రైలర్‌ను ఆగస్టు 10న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సురేశ్ ఫిలింస్ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది.
ఈ సినిమా గురించి దర్శకుడు బిక్షు మాట్లాడుతూ, తెలుగులో వచ్చే ట్రెండ్‌సెట్టర్ సినిమాల జాబితాలో ’హుషారు పిట్టలు’ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్ర పతాక సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని బెక్కెం వేణుగోపాల్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, నిర్మాత వెంకట్ యాదవ్, హీరో అన్షు, హీరోయిన్ వాసవి గణేశన్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 15న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.








