తెలుగు ప్రేమకథల్లో ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్ ఇప్పుడు కొత్త ట్రెండ్‌గా మారింది. రియల్ లైఫ్‌లో చర్చించుకునే ఈ అంశాన్ని, రీల్ లైఫ్‌లో ఎమోషనల్ పాయింట్‌గా మలచడానికి మేకర్స్ ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఆగస్ట్ 14న బాక్సాఫీస్ వద్ద రెండు భిన్నమైన ఏజ్ గ్యాప్ కథలు పోటీ పడబోతున్నాయి.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ఈ జాబితాలో ముందుంది. 40 ఏళ్లు దాటిన సూర్య, పాతికేళ్ల మమిత బైజు మధ్య సాగే ప్రేమకథగా ఇది రూపొందింది. ఈ సున్నితమైన సబ్జెక్ట్‌ను దర్శకుడు ఎమోషనల్‌గా ఎలా చూపించారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అదే రోజున తమిళ హీరో కవిన్, నయనతార జంటగా నటించిన 'హాయ్' మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓల్డర్ ఉమెన్, యంగర్ బాయ్ మధ్య సాగే ఈ రామ్-కామ్ (రొమాంటిక్ కామెడీ) సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు ఒకే రోజు విడుదలవుతుండటంతో, ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్ చుట్టూ ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెరుగుతోంది.

గతంలో నవీన్ పొలిశెట్టి, అనుష్క నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమా ఇదే తరహా ఏజ్ గ్యాప్ పాయింట్‌తో వచ్చి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. మెచ్యూర్డ్ ఉమెన్, యంగ్ బాయ్ మధ్య ఉన్న మైండ్ సెట్ గ్యాప్‌ను ఎంటర్టైనింగ్‌గా చూపించడం ఆ సినిమా సక్సెస్‌కు కారణమైంది. ఇప్పుడు వస్తున్న కొత్త సినిమాలు కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తాయేమో చూడాలి.