నారా రోహిత్ పుట్టినరోజును పురస్కరించుకుని ‘ఆదర్శ కుటుంబం’ చిత్ర నిర్మాతలు ఆయన పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రోహిత్ డైనమిక్ లుక్‌లో కనిపిస్తుండగా, నేపథ్యంలో తెలంగాణ పోలీసు బోర్డు ఉండటంతో ఆయన పోలీసు పాత్ర పోషిస్తున్నట్లు నిర్ధారణ అయింది. తాను ఈ సినిమాలో మాస్ పోలీసు అధికారిగా నటిస్తున్నానని రోహిత్ స్వయంగా తెలిపారు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌లో వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. కుటుంబ వినోదభరిత కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాను అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. అప్పటివరకు షూటింగ్ సహా మిగిలిన నిర్మాణ పనులను పూర్తి చేసి, నిర్ణీత తేదీకే సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.








