బాలీవుడ్ నటుడు జితేంద్ర 1970లలో ముంబైలోని పాలీ హిల్‌లో 3,450 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న బంగ్లాను రూ. 4.25 లక్షలకు కొనుగోలు చేశారు. అప్పట్లో ఆ ధర పెద్ద మొత్తమే అయినప్పటికీ, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆయన ఆ ఆస్తిని సొంతం చేసుకున్నారు.
ఇల్లు కొన్న తర్వాత జితేంద్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఆ బంగ్లాను అమ్మేయాలని స్నేహితులు సలహా ఇచ్చినా, ఆయన వెనక్కి తగ్గలేదు. భూమి విలువ ఎప్పటికైనా పెరుగుతుందన్న నమ్మకంతో ఆ ఆస్తిని అలాగే ఉంచుకున్నారు.
ప్రస్తుతం ముంబైలోని పాలీ హిల్ ప్రాంతం దేశంలోనే అత్యంత ఖరీదైన నివాస ప్రాంతాల్లో ఒకటిగా మారింది. ఇక్కడ స్టార్ హీరోలు, దర్శకులు, వ్యాపారవేత్తలు ఉండటంతో భూముల ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో, జితేంద్ర కొన్న ఆ బంగ్లా విలువ ఇప్పుడు రూ. 450 కోట్లకు చేరిందని ఆయన కుమారుడు తుషార్ కపూర్ తెలిపారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జితేంద్ర స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల వల్ల కలిగే లాభాలపై ఇప్పుడు సినీ సర్కిళ్లలో చర్చ జరుగుతోంది.








