ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాంతీయవాదాన్ని వేర్పాటువాదంతో సమానం చేసిన విషయమై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు. ఈ మేరకు కరీంనగర్‌లో టిఆర్‌ఎస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసు నమోదు చేయలేని స్థితిలో తెలంగాణలో ప్రభుత్వం ఉందని ఆమె విమర్శించారు.
తెలంగాణ ఉద్యమకారుల పట్ల ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని, ఈ అంశాన్ని అతి తక్కువ ప్రాధాన్యత గల విషయంగా భావిస్తోందని కవిత ఆరోపించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పలువురు నేతలు తెలంగాణ భావజాలంపై దాడులు చేస్తున్నారని ఆమె అన్నారు.
తెలంగాణ ఉద్యమానికి పెద్ద దిక్కుగా నిలిచిన కరీంనగర్‌లో కూడా తెలంగాణ తల్లి విగ్రహం లేకపోవడం ప్రజల త్యాగాలను అవమానించినట్లేనని కవిత అభిప్రాయపడ్డారు. ఉద్యమకారులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఈ విషయాన్ని ప్రాధాన్యత లేని అంశంగా భావిస్తోందన్నారు.







