బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ మరియు టాలీవుడ్ స్టార్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహం చేసుకున్న ఒక సంవత్సరం కూడా పూర్తి కాకముందే, ప్రముఖ సెలబ్రిటీ డేటింగ్ యాప్ 'రాయా'లో జాకీ ప్రొఫైల్ కనిపించడం వల్ల సోషల్ మీడియా హంగామా.

రెడ్డిట్‌లో లీక్ అయిన స్క్రీన్‌షాట్ల ప్రకారం, జాకీ పేరుతో ఉన్న ప్రొఫైల్ బయోలో 'నటుడు/నిర్మాత' అని ఉంది. కానీ 'నిర్మాత' అనే పదం తప్పు స్పెల్లింగ్‌తో, లొకేషన్ లండన్ అని చూపించడం వల్ల నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఈ ప్రొఫైల్ నిజమేనా లేక ఫేక్ అకౌంటేనా అనే ప్రశ్నలతో నెట్టింట్ చర్చలు ఎగసిపడ్డాయి.

'రాయా' యాప్ సాధారణ డేటింగ్ యాప్‌లా కాదు. ఇది సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లకు మాత్రమే అందుబాటులో ఉండే రహస్య ప్లాట్‌ఫారమ్. ఇందులో మెంబర్‌షిప్ కోసం అప్లై చేసుకోవాలి. యాప్ నిర్వాహకులు బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసి మాత్రమే యాక్సెస్ ఇస్తారు. పెళ్లయిన బాలీవుడ్ నిర్మాతుడి ప్రొఫైల్ ఇక్కడ కనిపించడం వల్ల నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

గత ఏప్రిల్‌లో జాకీ ఒక ఇంటర్వ్యూలో తమ బంధాన్ని 'సిచుయేషన్‌షిప్' అని పేర్కొన్నప్పుడు పెద్ద వివాదం రేగింది. అప్పటికి రకుల్ తీవ్రంగా ప్రతిస్పందించి, ఆ వ్యాఖ్యలను క్లిక్‌బైట్‌గా ఉపయోగించారని తేల్చారు. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో ప్రేమలో పడిన ఈ జంట 2024లో గోవాలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్తలపై రకుల్ లేదా జాకీ ఎవరూ స్పష్టత ఇవ్వలేదు.