కర్నూలు జిల్లా నందవరం మండలంలోని హాలహర్వి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం 150 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు. ఆ ఉపాధ్యాయుడు తీవ్ర అనారోగ్య సమససలతో సతమటమవుతున్నారు. ఇటీవల సర్జరీలు చేయించుకోవడానికి మెడికల్ లీవ్ తీసుకోబోతున్నట్లు తెలిసింది.

ఉపాధ్యాయుడు లేకపోతే ఈ పిల్లలకు ఎవరు బోధిస్తారో అనే ఆందోళనతో విద్యార్థులు శనివారం పాఠశాల ముందు నిరసన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్తు గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 16 వేల ఉపాధ్యాయుల నియామకాలు జరిగినప్పటికీ, ఈ పాఠశాలకు ఒక్క ఉపాధ్యాయుడిని కూడా నియమించకపోవడంపై ప్రజలు కోపంగా ఉన్నారు. పాఠశాల భవనం అసంపూర్తిగా ఉండటం మరో సమస్యగా నిలిచింది. పిల్లలు భయం తో కూడిన వాతావరణంలో చదువుతున్నారని గ్రామస్తులు వివరించారు.

విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ మరియు డిప్యూటేషన్ ఆఫీసర్ (DEO) లను సంప్రదించి తక్షణమే ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. పిల్లల విద్యా హక్కులు రక్షించడానికి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.