చెవిలోకి వెళ్ళకుండా ఓపెన్-ఇయర్ డిజైన్తో వచ్చిన ఈ బడ్స్‌లో లిక్విడ్ సిలికాన్ కోటింగ్ ఉన్న ఫ్లెక్సిబుల్ వైర్ హుక్ ఉంటుంది. ఇది చెవి వెనక భాగం నుంచి లూప్ లా చుట్టుకుని, మెయిన్ డ్రైవర్‌ను స్థిరంగా ఉంచుతుంది. జిమ్ చేసినా, రన్నింగ్ చేసినా చెవికి నొప్పి కలగదు.
13mm హైబ్రిడ్ డయాఫ్రాగమ్ డ్రైవర్లు, LHDC కోడెక్ సపోర్ట్ వల్ల వోకల్స్, యూట్యూబ్ వీడియోలు స్పష్టంగా వినిపిస్తాయి. కానీ డీప్ బేస్ సౌండ్ తక్కువగా ఉండవచ్చు. కాలింగ్ సమయంలో 4-మైక్రోఫోన్ సిస్టమ్, AI నాయిస్ క్యాన్సిలేషన్ ద్వారా ఆఫీస్ మీటింగ్లు క్రిస్టల్ క్లియర్‌గా ఉంటాయి.
35 గంటల బ్యాటరీ బ్యాకప్, ఇన్‌స్టాఛార్జ్ టెక్నాలజీ ద్వారా 10 నిమిషాల ఛార్జింగ్‌తో 3 గంటల ప్లేబ్యాక్ టైమ్ ఉంటుంది. బ్లూటూత్ 5.3, డ్యూయల్ డివైజ్ పెయిరింగ్ ద్వారా లాప్‌టాప్, మొబైల్‌కు ఒకేసారి కనెక్ట్ చేయవచ్చు. యూత్, ఆఫీస్ వర్కర్స్ ఈ బడ్స్‌ను ఇష్టపడతారు.








