వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 ఇప్పుడే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ₹3,099 స్పెషల్ డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఇయర్‌బడ్స్‌ను ఆన్‌లైన్‌లోనే కాకుండా ప్రధాన రిటైల్ స్టోర్‌లలో కూడా కొనుగోలు చేయవచ్చు.
ఈ ఇయర్‌బడ్స్‌లలో 54 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఉంది. IP55 రేటింగ్ కారణంగా నీళ్లు, చెమట తాకినా సమస్య ఉండదు. 52dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), ట్రాన్స్‌పరెంట్ మోడ్ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉన్నాయి.
ఈ ఇయర్‌బడ్స్‌లో 12mm టైటానియం డ్రైవర్లు ఉన్నాయి. 6 మైక్రోఫోన్‌లు మరియు ఏఐ కాల్ నాయిస్ క్యాన్సిలేషన్ ద్వారా క్లియర్ కాల్స్‌ను అందిస్తాయి. ఏఐ అసిస్టెంట్ ద్వారా అలారాలు, వాతావరణం, ట్రాన్స్‌లేషన్ వంటి సేవలను యాక్సెస్ చేయవచ్చు.
ఒక సింగిల్ ఛార్జ్‌తో 54 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ఉంది. 10 నిమిషాల ఛార్జ్‌తో 11 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ కూడా సాధ్యం. ఈ ఇయర్‌బడ్స్ బరువు కేవలం 4.3 గ్రాములు మాత్రమే. ఇది ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యంత కాంపాక్ట్ మరియు స్టైలిష్ ఇయర్‌బడ్స్‌లలో ఒకటిగా గుర్తించబడుతోంది.








