శ్రీ గంగానగర్ జిల్లాలో ఒక 13 ఏళ్ల బాలికను రిక్షా డ్రైవర్ తప్పిపోయినట్లు నటించి హోటల్ యజమానులకు అమ్మాడు.

కేవలం ఐదు రోజుల్లో హోటల్ యజమానులు, మేనేజర్లు కలిసి 30 మందికి పైగా ఆ బాలికపై అత్యాచారం చేసి బలవంతంగా మద్యం ఇచ్చి అఘాయిత్యానికి గురిచేశారు.

ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత, జిల్లాలో ప్రజలు, విద్యార్థులు తీవ్ర నిరసనలు చేపట్టారు. ఎమ్మెల్యే రూపిందర్ సింగ్ కన్నార్ ఈ నేరాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసి, ప్రధాన నిందితులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఈ కేసు జిల్లాలోని అక్రమ హోటళ్ల వ్యాపారాన్ని బట్టబయలు చేసింది.

శ్రీ గంగానగర్ పర్యాటక ప్రాంతం కావడంతో ఇక్కడ 150కి పైగా అక్రమ హోటళ్లు పనిచేస్తున్నాయి. వీటిలో కేవలం 40 హోటళ్లకు మాత్రమే రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. మిగిలిన హోతళ్లకు ఎలాంటి లైసెన్సులు లేవు. ఈ హోటళ్ల మాఫియా పనితీరు గురించి ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి.

పోలీసులు, నిఘా వ్యవస్థ ఈ ఘటనను ఎలా నిరోధించలేకపోయిందో ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.