హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో ఆటో డ్రైవర్ భరత్‌పై జరిగిన దాడి ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. తన ఆటోపై ఉన్న హిందుత్వ నినాదాలను దుండగులు గీకేయడంపై భరత్ చేసిన ఆరోపణల నేపథ్యంలో, ఆయనకు అండగా నిలిచేందుకు మంత్రి నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో కరీంనగర్ చేరుకున్న భరత్‌కు బండి సంజయ్ కొత్త ఆటోను కొనిచ్చారు. అనంతరం ఆ హిందుత్వ నినాదాలు రాసి ఉన్న ఆటోను మంత్రి స్వయంగా నడిపారు. జ్యోతినగర్ నుంచి లక్ష్మీనగర్ వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర ఆయన ఆటోను నడుపుకుంటూ వెళ్లారు.
హిందుత్వ నినాదాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న భరత్ పనితీరును ఈ సందర్భంగా బండి సంజయ్ అభినందించారు. భరత్‌కు అన్ని విధాలుగా అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం పాత ఆటో స్థానంలో కొత్త వాహనాన్ని అందజేసి తన మద్దతును ప్రకటించారు.








