Telugu » Movies » Trisha Celebrates Vijay Birthday Special Photo Goes Viral

Vijay Trisha : గతంలో కేవలం రూమర్స్ గా ఉన్న విజయ్ – త్రిష రిలేషన్ ఇప్పుడు ఆల్మోస్ట్ అధికారికం అయిపొయింది. విజయ్ భార్య విడాకులు అప్లై చేసిన దగ్గర్నుంచి విజయ్ – త్రిష కలిసి కనపడటం, విజయ్ ఇంటికి త్రిష వెళ్లడం, ఇద్దరూ కలిసి బయటకు వెళ్లడం, విజయ్ ఇంట్లో వాళ్ళతో త్రిష కలిసి కనపడటంతో వీరు రిలేషన్ లో ఉన్నారని అందరూ ఫిక్స్ అయ్యారు.

అయితే నిన్న విజయ్ పుట్టిన రోజుకి త్రిష శుభాకాంక్షలు చెప్పకపోవడం, పైగా విజయ్ ని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడంతో అంతా షాక్ లో ఉన్నారు. వీరిద్దరూ అప్పుడే విడిపోయారా అని కూడా రూమర్స్ వచ్చాయి. కానీ అలాంటి వార్తలన్నిటికి చెక్ పెడుతూ త్రిష ఓ స్పెషల్ ఫోటో షేర్ చేసింది.

విజయ్ బర్త్ డేని అర్ధరాత్రి సెలబ్రేట్ చేసిన ఫోటోని త్రిష తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. విజయ్ – త్రిష వారి ముందు కేక్ ఉన్న ఈ ఫోటోని షేర్ చేసి.. అన్నిటిని విలువగా మార్చే వ్యక్తికి హ్యాపీ బర్త్ డే అంటూ పోస్ట్ చేసింది. ఈ సెలబ్రేషన్ అర్ధరాత్రి 12 గంటలకు జరిగినట్టు హింట్ గా 00.00 అని కూడా పోస్ట్ చేసింది. దీంతో త్రిష సెలబ్రేట్ చేసిన విజయ్ బర్త్ డే స్పెషల్ ఫోటో వైరల్ అవ్వగా వీరి రిలేషన్ మరింత బలపడిందని అంటున్నారు.