వంట కార్మికుల ఉద్యోగాలకు భంగం కలగదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హామీ ఇచ్చింది.

స్మార్ట్ కిచెన్స్ విధానం కారణంగా వంట కార్మికులను తొలగిస్తున్నారనే ఆరోపణలను ఖండించింది. రాష్ట్రవ్యాప్తంగా 85 వేల మంది కార్మికుల సేవలను పూర్తిగా గౌరవిస్తున్నట్లు తెలిపారు.

ఏప్రిల్ నెల వరకు గౌరవ వేతనాలు చెల్లించామని, మిగిలిన బకాయిలను త్వరలో నేరుగా కార్మికుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తామని ప్రభుత్వం వివరించింది. గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన 350 కోట్ల రూపాయల పైచిలుకు బకాయిలను విడుదల చేసినట్లు గుర్తు చేసింది.