గత ఏడాది యాక్షన్, రొమాంటిక్ చిత్రాలకే పరిమితమైన బాలీవుడ్ ప్రేక్షకులు, ఇప్పుడు కామెడీ జోనర్‌కు పట్టం కడుతున్నారు. గతంలో హౌస్ ఫుల్5, సన్నాఫ్ సర్దార్2, మస్తీ4, జానీ ఎల్ ఎల్బీ3, భూత్నీ వంటి చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచినప్పటికీ, 2026లో పరిస్థితి పూర్తిగా మారింది.
ఈ ఏడాది సమ్మర్ సీజన్‌లో విడుదలైన అక్షయ్ కుమార్ హారర్ కామెడీ చిత్రం 'భూత్ బంగ్లా' భారీ విజయాన్ని అందుకుంది. అలాగే, యావరేజ్ టాక్‌తో మొదలైన రొమాంటిక్ కామెడీ డ్రామా 'కాక్ టైల్2' కూడా ప్రేక్షకుల ఆదరణతో హిట్ చిత్రంగా నిలిచింది. మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, అక్షయ్ కుమార్ నటించిన అడ్వంచర్ కామెడీ చిత్రం 'వెల్కమ్ టు ది జంగిల్' థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి రూ. 190 కోట్లు వసూలు చేసింది.
ఇటీవల విడుదలైన 'ధమాల్4' సినిమాకు ప్రారంభంలో నెగిటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ, ప్రేక్షకుల మద్దతుతో వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడానికి ఇంకా రూ. 25 నుండి 40 కోట్ల గ్రాస్ వసూళ్లు అవసరమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
ప్రస్తుతం థియేటర్లలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో, 'ధమాల్4' సులభంగా గట్టెక్కుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, గత ఏడాదిలా కాకుండా ఈ ఏడాది కామెడీ ఎంటర్టైనర్లకు బాలీవుడ్‌లో మంచి రోజులు వచ్చాయని స్పష్టమవుతోంది.








