ధరణి, భూ భారతి పోర్టల్స్‌లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ముక్తేశ్వరం లిఫ్ట్ నీటి పారుదల ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
అంతేకాకుండా, విద్యాశాఖలోనూ మార్పులు చేపట్టారు. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 29 మంది బోధన, బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.








