ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మంద మకరందు మంగళవారం రాత్రి కెరమెరి మండలం హట్టి ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదులు, హాజరు పట్టికలు మరియు వసతి సదుపాయాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, ఉపాధ్యాయులు పాఠాలు సరిగ్గా బోధిస్తున్నారో లేదో విద్యార్థులతో ప్రత్యక్షంగా సంభాషించారు.
బ్లాక్ బోర్డ్ ద్వారా విద్యార్థులకు ప్రశ్నలు అడిగి సమాధానాలు సేకరించారు. పాఠశాల వంటగదులు మరియు స్టోర్ రూమ్లు శుభ్రంగా ఉండాలని, నాణ్యమైన కూరగాయలు మాత్రమే ఉపయోగించాలని PVO ప్రత్యేక సూచనలు చేశారు. ఉపాధ్యాయులు లేదా సిబ్బంది హాజరు లేకపోతే లేదా పాఠశాల నిర్వహణలో నిర్లక్ష్యం కనిపిస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు, పాఠశాల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థుల భోజన నాణ్యత మరియు పాఠశాల పరిసర పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులు నొక్కిచెప్పారు.








